మణుగూరు సెప్టెంబర్ 30 వై7 న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో సోమవారం సాయంత్రం ఆకాశంలో వింత ఆకారం హల్చల్ చేసింది. అదేంటో తెలియక జనాలు ఎగబడి చూశారు. తమ ఫోన్ కెమెరాలలో జూమ్ చేసి మరి ఆ ఆకారాన్ని క్యాప్చర్ చేశారు. సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల మధ్యలో ఆల్చిప్ప మాదిరిగా ఉన్న ఆకారం స్పష్టంగా దర్శనమిచ్చింది. దానిని గమనించిన పలువురు తమ ఫోన్ కెమెరాలలో వీడియోలు తీశారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. అది ఏదైనా గ్రహమా లేక నక్షత్రమా మబ్బుల వల్ల ఏర్పడిన ఆకారమా అని జనాలు చర్చించుకుంటున్నారు. ఈ ఫోటో చూసి మీరైనా ఇది ఏంటో కనిపెట్టండి.
Post Views: 980