E-PAPER

ఎంఈఓ గా అదనపు బాధ్యతను చేపట్టిన పర్వతీ సత్యనారాయణ

తూప్రాన్, సెప్టెంబర్ 26 వై సెవెన్ న్యూస్ ప్రతినిది;

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ లోని జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు పర్వతి సత్యనారాయణకు వివిధ పాఠశాలల్లో తాను చేసిన సేవను గుర్తించి ప్రభుత్వం ఆయనకు అదనపు ఎంఈఓ ఉద్యోగ అవకాశాన్ని కల్పించడం జరిగింది. తూప్రాన్ మండలం ఎంఈఓ గా అదనపు బాధ్యతను చేపట్టే క్రమంలో గురువారం రోజున పుట్ట కోటలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు…
నేను గతంలో తూప్రాన్ జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా సేవలందిస్తున్నానని అదే కాకుండా నోడల్ ఆఫీసర్ గా బాధ్యతలను చేయడం జరిగిందని వారు తెలుపుతూ, నేను ఒక పేద కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నానని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించుచున్న విద్యార్థులు వాళ్ళ పరిస్థితిని పూర్తిగా తెలిసిన వాడనని ప్రభుత్వం నాకు కల్పించిన ఈ అదనపు బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ మెదక్ జిల్లాలోని విద్యాపరంగా తూప్రాన్ ను నంబర్ వన్ మండలం గా తయారు చేస్తానని హామీ ఇచ్చారు. వివిధ గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల తీరును ఎల్లవేళలా పసిగడతానని వాటి అభివృద్ధికి కృషి చేస్తానని ఎలాంటి ఇబ్బందులు ఉన్న తక్షణమే వాటిని సమకాలిన పద్ధతిలో అమలు పరుస్తానని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :