E-PAPER

భూనిర్వాసితులపై పెట్టిన అక్రమ కేసులు తొలగించాలని పసర ఎస్సై కి ఆదేశాలు జారీ చేసిన సీతక్క

ప్రజల మనిషి అని మరోసారి రుజువు చేసుకున్న సీతక్క

. చల్వాయి భూనిర్వాసితులకు అండగా మంత్రి సీతక్క

గోవిందరావుపేట,సెప్టెంబర్14 వై 7 న్యూస్

ములుగు జిల్లా గోవిందరావుపేట మండల పసర గ్రామంలో మంత్రి సీతక్క ఆదేశాల మేరకు గత బి.ఆర్.ఎస్. ప్రభుత్వం చల్వాయి గ్రామంలో ఐదవ బెటాలియన్ కోసం చల్వాయి గ్రామ ప్రజల భూముల్ని గుంజుకున్నదని, భూములకు కనీస నష్ట పరిహారం కూడా ఇవ్వకుండా భూముల్ని గుంజుకున్న బి.ఆర్.ఎస్.ప్రభుత్వంపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన ప్రజలపై అక్రమ కేసులు బనాయించారని కావున వెంటనే వారిపై గత ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తివేయాలని సీతక్క పసర ఎస్సై కి ఆదేశాలు జారీ చేయగా, పసర ఎస్సై ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పైడాకుల కృష్ణమూర్తి మర్యాదపూర్వకంగా కలిసి రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భముగా కృష్ణమూర్తి మాట్లాడుతూ చల్వాయి గ్రామంలో ఐదవ బెటాలియన్ కోసం చల్వాయి గ్రామ ప్రజల భూముల్ని గుంజుకున్నా గత బి.ఆర్ ఎస్.ప్రభుత్వం వల్ల భూనిర్వాసితుల జీవనాధారం కోల్పోయారని, అందుకే అప్పటి బి.ఆర్.ఎస్. ప్రభుత్వంపై ఆందోళనకు దిగిన రైతులపై అక్రమ కేసులు బనాయించారని అన్నారు. దొరల ప్రభుత్వంలో సామాన్య ప్రజలు ప్రశ్నిస్తే కేసులు పెట్టారని అన్నారు. భూములు కోల్పోయిన వారికి కనీస నష్ట పరిహారం అందించకుండా కేసులు పెట్టడం దుర్మార్గం అని సీతక్క అన్నారు. భూనిర్వాసితులకు అండగా కేవలం సీతక్క మాత్రమే ఉన్నారని, వారికి ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం వారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి అని పసర ఎస్సై కి ఆదేశాలు జారీ చేశారు. అందుకే సీతక్క ఒకసారి మాట ఇస్తే తప్పదని, ప్రజల కోసం పని చేసే నాయకురాలు అని, ప్రజా సంక్షేమం కోసం మాత్రమే సీతక్క పని చేస్తుంది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ అని, రైతులకు అండగా నిలబడుతుందని, రైతుల అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అందుకే గత బి.ఆర్.ఎస్. ప్రభుత్వం ఏకకాలంలో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి నాలుగు విడతలుగా చేసి రైతులు తీసుకున్న పంట రుణం యొక్క వడ్డీ కూడా చెల్లించలేకపోయారు అని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో రెండు లక్షల పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో చల్వాయి మాజీ ఎంపీటీసీ గుండెబోయిన నాగలక్ష్మి ,అనిల్ యాదవ్, గ్రామ అధ్యక్షులు వేల్పుగొండ ప్రకాష్, మాజీ సర్పంచ్ మేకల సుదర్శన్, వేల్పుగొండ పూర్ణ, జంపాల అనిల్, నారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్