మిర్యాలగూడ,సెప్టెంబర్ 11 వై 7 న్యూస్
నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని నిర్మాణంలో ఉన్న యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో కొంత కాలంగా దొంగతనాలు జరుగుతున్నాయి. రెండేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను మిర్యాలగూడ పోలీసులు అతి చాకచక్యంగా అరెస్టు చేశారు.
బుధవారం నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దొంగల ముఠా వివరాలను వెల్లడించారు. యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ పరిసర గ్రామాల్లోని ఉన్న వారు ముఠాగా ఏర్పడి రాత్రి వేళలో ధర్మల్ ప్లాంట్ లో జొరబడి కాఫర్ వస్తువులను దొంగిలించేవారని తెలిపారు. దొంగిలించిన కాపర్ వస్తువులన్నింటినీ ఒక దగ్గర నిల్వచేసి మిర్యాలగూడ ప్రాంతంలోని పాత ఇనుము దుకాణాలలో అమ్మి సొమ్ము చేసుకునే వారిని తెలిపారు.
దామరచర్ల మండలం తాళ్ల వీరప్ప గూడెం గ్రామానికి చెందిన వండెం భాస్కర్, చెన్నబోయిన నాగయ్య, సాత్ తండాకు చెందిన గుగులోతు రఘు, గుగులోతు రాముడు, దుబ్బ తండా కు చెందిన కొత్త శివ ముఠాగా ఏర్పడి రాత్రి వేళలో యాదాద్రి ధర్మల్ ప్లాంట్ లోకి ప్రవేశించి బిహెచ్ఇఎల్ కంపెనీకి చెందిన స్టోర్ యార్డ్ వద్ద సెక్యూరిటీ లేని సమయంలో కాపర్ మెటీరియల్ ను దొంగిలించేవారన్నరు.
దొంగిలించిన కాపర్ ను నిర్మానుష్య ప్రాంతంలో పోగుచేసి వాహనంలో మిర్యాలగూడలోని తెలిసిన పాత ఇనుప దుకాణాల వారు పగడాల బాలరాజు, మేకల శ్రీను, బత్తుల జానకి రాములు కు విక్రయించి సొమ్ము చేసుకునేవారని, ఈ తత్తంగమంతా రెండు సంవత్సరాలుగా సాగుతుందని తెలిపారు.
నమ్మదగిన సమాచారం మేరకు ఈదులగూడెంలోని పగడాల బాలరాజు ఇనుప షాపు వద్ద నేరస్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి 26 లక్షల రూపాయల నగదు, మహేంద్ర క్యాంపర్ వాహనం ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడ టూ టౌన్ సిఐ నాగార్జున, రూరల్ సిఐ వీరబాబు, సిసిఎస్ జితేందర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్, గిరి, పుష్పగిరి, వహీద్ భాషా, వాడపల్లి ఎస్సై, మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐలను ఎస్పీ అభినందించారు.