జోగులాంబ, సెప్టెంబర్ 10 వై 7 న్యూస్;
జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఇద్దరు దళిత మైనర్ బాలికల పై లైంగిక దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే ఛత్తీస్గాడ్ ఇన్చార్జ్ SA సంపత్ కుమార్ పోలీసులు కోరారు. బాలికలపై లైంగిక దాడికి సంబంధించివారిపై రాష్ట్ర డిజిపి, డి ఐ జి,జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తులతో పాటు వారికి సహకరించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించ కూడదని తెలిపారు. పాఠశాలకు బయలుదేరిన బాలికలపై దుండగులు లైంగిక దాడికి పాల్పడడం హేయనీయమన్నారు. వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తామని బాలికలను బెదిరించి లైంగిక దాడికి పాల్పడడం సభ్య సమాజానికి తలవంపు అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ఇలాంటి ఘటనలకు తావుండ కూడదన్నారు.మహిళల,బాలికల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చట్టాలు అమలు చేస్తుందని ఛత్తీస్గాడ్ ఏఐసీసీ ఇన్చార్జ్ SA సంపత్ కుమార్ పేర్కొన్నారు. లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు యువకులను,వారికి సహకరించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన సంబందించిన అధికారులకు ఆదేశించారు.