. సాగర్ కెనాల్, శ్రీరామ్ సాగర్ కెనాల్ లలో నిమర్జనం చేయొద్దు.
. స్థానికంగా ఉన్న చెరువులు, కుంట లలో నిమర్జనం చేసుకోవాలి.
. ప్రమాదాలకు దూరంగా ఉండాలి.
. సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.
సూర్యాపేట సెప్టెంబర్ 09 వై 7 న్యూస్
జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, ప్రతి మండపాన్ని గ్లోబల్ జియో ట్యాగింగ్ చేసి పర్యవేక్షణ చేస్తున్నాము అని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారు అన్నారు. త్రాగునీటి అవసరాల కోసం ఉపయోగించే నీటిలో గణేష్ విగ్రహాలు నిమర్జనం చేయవద్దు, ముఖ్యంగా సాగర్ కాల్వ, శ్రీరామ్ సాగర్ కాల్వల్లో విగ్రహాలు నిమర్జనం చేయవద్దు అని ఎస్పి కోరారు. గణేష్ విగ్రహాల తయారీలో ఉపయోగించే POP, రంగుల వల్ల నీరు కలుషితమై ప్రజల ఆరోగ్యాలకు హని కలిగే అవకాశం ఉన్నది అన్నారు. గ్రామాలు, పట్టణాలు, కాలనీల్లో ఏర్పాటు చేసే గణేష్ విగ్రహాలను స్థానికంగా అందుబాటులో ఉండే చెరువులు, కుంట లలో నిమర్జనం చేసుకోవాలి అని కోరారు. నిమర్జనం కోసం వాహనాల్లో ఎక్కువ దూరం ప్రయాణం చేయడం కూడా ప్రమాదకరమైనది అని అన్నారు. నిమర్జనం సమయంలో పిల్లలను, మహిళలను, వృద్దులను ఒక కంట కనిపెట్టుకొని ఉండాలని తెలియజేశారు.