బాన్సువాడ, సెప్టెంబర్ 9 వై 7 న్యూస్
బాన్సువాడ ఆర్డిఓ కార్యాలయం ముందుఇద్దరు పిల్లలతో మహిళ దీక్షకు దిగారు. వివరాల్లోకి వెళ్తే జూకల్ మండలం కౌలాస్ గ్రామానికి చెందిన పూజ , ఆమె తల్లిదండ్రులకు చెందిన భూమిని ఒక వ్యక్తి అక్రమంగా పట్టా చేసుకుని అనుభవిస్తున్నాడని ఆమె సోమవారం దీక్షకు కూర్చున్నారు. తండ్రి మరణాంతరం 2018లో తల్లి కూడా చనిపోయింది తల్లి పేరు మీద ఉన్న భూమి వారసురాలైన పూజ పేరు మీద రెవెన్యూ అధికారులు చేయవలసి ఉండగా, పూజ ఆ సమయంలో మైనర్ ఉండడం వల్ల ఎకరం మూడు గుంటల భూమిని పట్టా చేసే అధికారం లేదని, ఒక వ్యక్తితో రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఆ భూమిని ఒక వ్యక్తి పేరు మీద పట్టా చేసి పెట్టారు. ఇప్పుడు ఆ భూమి ఇవ్వాలని పూజ అధికారులకు మొరపట్టుకున్నప్పటికీ అధికారులు కరుణించకపోవటంతో న్యాయం కోసం సబ్ కలెక్టర్ కార్యాలయం మెట్లు ఎక్కవలసన పరిస్థితి తీసుకువచ్చారు జూకల్ రెవెన్యూ అధికారులు. ఇద్దరు పిల్లలతో పూజ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బయట నుంచి ఒకరోజు దీక్షకు కూర్చున్నారు. తన సమస్యలు చెప్పుకోవడానికి వస్తే సబ్ కలెక్టర్ అందుబాటులో లేకపోవడం నిరాశగా వెళ్లిపోయింది. తన భూమి తనకు వారు రోజుల్లో తన పేరు మీద పట్టా కాకుంటే సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆమరణ దీక్షకు పూకుంటానని పూజ హెచ్చరించారు. ఈ విషయంపై జూకల్ తాసిల్దార్ హిమబిందువివరణ కోరగా తన వద్దకు ఎవరూ రాలేదని, వస్తే పూర్తి వివరాలు విచారించి న్యాయం చేస్తానని తాసిల్దార్ వెల్లడించారు.