మంగపేట,సెప్టెంబర్05, వై 7న్యూస్;
మంగపేట మండల నయాబ్ తహసిల్దార్ జె మల్లేశ్వర రావు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ మండల ప్రజలకు తమ సేవలను అందిస్తున్న సందర్భంగా ఆగస్టు 15 రోజున మంత్రి మరియు కలెక్టర్ చేతులమీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు వచ్చినందున ఈరోజు జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మల్లేశ్వరరావు కి ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడల నరేష్ , ప్రధాన కార్యదర్శి మునిగాల రాకేష్ , గౌరవ సలహాదారులు కొలగట్ల నరేష్ రెడ్డి , ప్రచార కార్యదర్శి గగ్గూరి మహేష్ మరియు ట్రస్ట్ సభ్యులు సుంకోజు గణేష్ మరియు మిగతా సభ్యులు పాల్గొన్నారు.
Post Views: 119