. విపత్తు సమయంలో బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం
. జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో కన్వీనర్ పెంటేల బాలాజి
చిలకలూరిపేట: విపత్కర పరిస్థితుల్లోనే అసలు సిసలు నాయకత్వ లక్షణాలు బయటపడతాయని, కురుస్తున్న వర్షాల బాధిత ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడిందని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో కన్వీనర్ పెంటేల బాలాజి చెప్పారు.ఆదివారం ఆయన కార్యాలయంలో బాలాజి విలేకర్లతో మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి నివాసితులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్సం, చిత్తశుద్ది ఉండబట్టే కూటమి ప్రభుత్వం వర్షాలు ప్రారంభానికి ముందే అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు తన అన్ని పర్యటనలు రద్దు చేసుకొని నిరంతరం సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేశారన్నారు. ప్రజాప్రతినిధులు సైతం బాధిత ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు.
*విపత్కర పరిస్థితిలో అండగా*…
వరద సహాయక చర్యల్లో అధికారులకు సహకరిస్తూ, ప్రజలను తరలించటానికి,వారికి అండగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రకృతి విపత్తులు, వర్షాలు, వరదల సమయంలో సకాలంలో స్పందించ లేదని, ప్రజల ఇబ్బందులను పట్టించుకోలేదని గుర్తు చేశారు. పలు విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రజలకు అండగా నిలవని జగన్ ప్రజలను నట్టేట ముంచారని బాలాజి గుర్తు చేశారు. ఐదు సంవత్సరాల పాలన కాలంలో ప్రజలకు ఎన్ని రకాలుగా కష్టాలు వచ్చిన బయటకు అడుగు పెట్టలేదని, అధికారిక పర్యటనకు బయటకు వచ్చిన సమయంలో పరదాల చాటున పర్యటించారని ఆరోపించారు. ఇందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని వెల్లడించారు..రాష్ట్రంలో వర్షాలు కాస్త నెమ్మదించినా చాలా ప్రాంతాల్లో ఇంకా వరదలు కొనసాగుతున్నాయని ,. పలు జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్లు నడుస్తున్నాయని వివరించారు . ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ, పోలీసులు విస్తృతస్థాయిలో సహాయక చర్యలు చేపట్టారని,. అయితే సహాయం కోరే ప్రతి ఒక్కరి వద్దకు తక్షణమే సహాయక బృందాలు వెళుతున్నాయని చెప్పారు.