. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన గాంధీ పార్క్ ఓపెన్ జిమ్
. మందు బాబులకు హాయ్ హాయ్ మమ్ములను ఎవరు పట్టించుకోరండోయ్
హుజూర్ నగర్ ,ఆగస్టు29 వై 7 న్యూస్;
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని గాంధీ పార్క్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ మందుబాబులకు అడ్డాగా అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది పబ్లిక్ కోసం ఏర్పాటు చేసిన జిమ్ కార్యక్రమాలకు మందు బాబులకు సిట్టింగ్ కి పరిమితమైంది జిమ్ చేద్దామని వచ్చే మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు జిమ్ చేసే పరికరాలు కూడా పనిచేయడం లేదు ఇక్కడ వాకింగ్ చేయాలంటే నరకయాతన పడాల్సిందే వాకింగ్ చేసే వీలు లేకుండా అయింది వాకింగ్ చేసే ప్రదేశం మొత్తం పిచ్చి చెట్లు పెరగడంతో గాజువక్కలు పిచ్చి చెట్ల కింద పడడంతో వాకింగ్ చేసే వారికి కుచ్చుకొని గాయపడ్డ సందర్భం కూడా ఉంది కింద మ్యాట్లు కూడా పూర్తిగా ఆగమైనాయి ఈ ఏరియాలో ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి, గాంధీ పార్క్ నిజంగానే పార్కింగ్ గా మారింది సంబంధిత మున్సిపాలిటీ అధికారులు ఆగమై ఉన్న పరికరాలను వెంటనే బాగు చేసి పిచ్చి చెట్లను తొలగించి వాకింగ్ చేసే విధంగా మళ్లీ ప్రజలకు అందుబాటులో ఉపయోగపడే విధంగా చేయాలని మరియు మందుబాబులకు అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.