. ఆడపిల్లలకు కుంగ్ ఫు , కరాటే తోనే భద్రత
. ప్రతి విద్యార్ధి కుంగ్ ఫు , కరాటే పై ఆసక్తి పెంపొందించుకోవాలి
. న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్
రంగారెడ్డి జిల్లా ఆగస్టు 29 వై సెవెన్ న్యూస్
సమాజంలో ఆయా రంగాలలో మహిళలూ ఉన్నత రంగాలలో రాణిస్తూ దేశాన్ని ఏలే స్థాయికి చేరుకున్నారు. కానీ నేటి సమాజంలో కొందరు మహిళలూ తమను తాము రక్షించుకోలేని పరిస్థితి ఏర్పడిందని అలాంటి సమస్యకు చెక్ పెట్టేందుకు షాద్ నగర్ పట్టణ కేంద్రం లో న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో నైపుణ్యమైనా శిక్షణ అందించేందుకు కృషి చేస్తున్నారు. కుంగ్ ఫు , కరాటే వంటి యుద్ధ కళలు ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ ద్వారా తమను తాము రక్షించుకునే నైపుణ్యాన్ని అందిస్తాయి. విపత్కర పరిస్థితులలో ధైర్యంగా వ్యవహరించి, తమను తాము రక్షించుకోవడంలో యుద్ధ విద్యలు కీలకంగా ఉపయోగపడతాయన్నారు.ఈ కళలు శిక్షణ తీసుకోవడం ద్వారా మానసికంగా కూడా బలపడతారు. ఒత్తిడిని తగ్గించుకోవడం, ఏకాగ్రతను పెంపొందించుకోవడం మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం,ఆడపిల్లల వ్యక్తిత్వ వికాసానికి, సమాజంలో వారి స్థాయిని పెంచడానికి కూడా దోహద పడతాయని న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ నిర్వాహకుడు అహ్మద్ ఖాన్ తెలిపారు. ప్రతి తల్లితండ్రులు తమ తమ ఆడపిల్లలను కుంగ్ ఫు నేర్పించి వారిని శక్తివంతులుగా తయారయ్యేలా చూడాలని కోరారు.