బైంసా,ఆగస్టు29 వై 7 న్యూస్;
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి గిడుగు రామమూర్తి తెలుగు భాషకు చేసినటువంటి సేవల్ని కళాశాల ప్రిన్సిపల్ కర్నూల్ బుచ్చయ్య కొనియాడారు .వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భాషలో ఉన్నటువంటి గొప్పదనాన్ని తీసుకొని సంస్కృతిని సాహిత్యాన్ని ఇనుమడింపజేయాలని విలువలతో కూడుకున్న భావాలను మన తెలుగు భాషలో ఉన్నటువంటి గొప్పదనాన్ని వివిధ భాషల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. తెలుగు విభాగం అధ్యాపకులు ఆరే రాజు మాట్లాడుతూ తెలుగు భాషకు ఉన్న గొప్పదనాన్ని జీవభాష అయినటువంటి తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని ఆ భాషలో ఉన్నటువంటి వివిధ సాహిత్యాలను ఎప్పటికప్పుడు విద్యార్థులు అభ్యసిస్తూ తెలుగు భాషకు ఉన్న గొప్పతనం ఏ భాషకు లేదని ఈ సందర్భంగా కొనియాడారు. మాతృ భాషను నేర్చుకుంటూనే మాతృభాషలో ఉన్నటువంటి సాహిత్యాన్ని అభ్యసిస్తూనే మరి అన్య భాషలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కూడా తెలుసుకుంటూ వాటిని వృత్తిరీత్యా అనుసరిస్తూనే మాతృభాషను గౌరవించాలని ఈ సందర్భంగా వివిధ అధ్యాపకులు పేర్కొంటూ విద్యార్థులకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కార్యాలయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.