E-PAPER

ఆలయాని మీరు అభివృద్ధి చేయరు చేసే దాతలను చేయ్యనియ్యరు

. ధ్వజ స్తంభ పునః ప్రతిష్టను వాయిదా వేయడం సరి కాదు

. గుండెబోయిన నాగమణి
(మహిళ మోర్చ అధ్యక్షురాలు – మహబూబాబాద్ జిల్లా)

మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గం గార్ల మండల పరిధిలోని *మర్రి గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీ వేంకటేశ్వర స్వామి* వారి ఆలయంలో *ధ్వజ స్తంభ పునః ప్రతిష్ట ఉత్సవ కార్యక్రమం* నిలుపుదల చేసిన సందర్భంగా ఈ రోజు *మహబూబాబాద్ జిల్లా మహిళ మోర్చ అధ్యక్షురాలు శ్రీమతి గుండెబోయిన నాగమణి* మరియు మండల బిజెపి నాయకులు ఆలయాన్ని సందర్శించి వివరాలు తెలుసుకోని మాట్లడటం జరిగింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. ఇప్పటి వరకు ఇల్లందు నియోజకవర్గ MLA లు ఎవ్వరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిని పట్టించుకున్న దాఖలాలు లేవు.కాని ఒక NRI గత సంవత్సరం ఆలయ అభివృద్ధికి 1 కోటి 5 లక్షలు విరాళంగా ఇవ్వటం జరిగింది.వారు ఇచ్చిన నిధులతో ఆలయాని అభివృద్ధి చేయుచున్న తరుణంలో ….గత రెండు నెలల క్రితం భారి వర్షాలకు పురాతన ధ్వజ స్తంభం పడిపోవడం జరిగింది.అట్టి ధ్వజ స్తంభ పునః ప్రతిష్టకు కూడా అదే NRI… 10 లక్షల రూ.లను విరాళంగా ఇచ్చారు.. ఆలయ కమిటి మరియు గ్రామ పెద్దలు, పూజారులు అందరు కలిసి …ధ్వజ స్థంభ పునః ప్రతిష్ట కార్యక్రమాన్ని ఈ నెల 28 వ తేదీగా గత వారం రోజుల క్రితం నిర్ణయించి ..దానికి కావలసిన ఏర్పాట్లు చేయడం జరుగుతన్నది .
ఈ తరుణంలో… ఇల్లందు నియోజకవర్గ స్థానిక MLA గారు నాకు చెప్పలేదు అనే… ఒకే ఒక్క కారణంతో ఇట్టి కార్యక్రమాని వాయిదా వేయడం జరిగింది.ఒక వేళ ప్రోటోకాల్ ప్రకారం స్థానిక MLA గారికి సమాచారం ఇవ్వకుంటే కార్యక్రమం అయిపోయిన తదుపరి ఆలయ కమిటిపైన చర్యలు తీసుకోవచ్చు ,.. కమిటీని మార్చుకో వచ్చు . కాని అలా చేయకుండా ధ్వజ స్తంభ పునః ప్రతిష్ట కార్యక్రమాన్ని వాయిదా వేయడం అనేది హేయమైన చర్య.ఇప్పుడు ధ్వజ స్తంభం పునః ప్రతిష్ట చేయకుంటే మరో 3 నెలల వరకు ముహుర్తాలు లేవు అని పూజారులు చేప్పటం జరిగింది.అంటే రెండు నెలలో ఆలయంలో జరగబోయే బ్రహ్మోత్సవాలు చేయటం కూడా అసాధ్యం.
500 సం,ల నుండి ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుపోకోవటం ఆనవాయితి …ఈ రోజు ఆలయ కమిటి సభ్యులకు మరియు స్థానిక MLA అంతర్గత విభేదాల వల్లన ఈ ధ్వజ స్తంభ పునః ప్రతిష్ట కార్యక్రమాన్ని వాయిదా వేయడం అనేది సరైనది కాదు . వెంటనే స్థానిక MLA గారు పునరాలోచన చేసి ఈ దైవ కార్యక్రమాని ఈ నెల 28వ తేదిన జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమే డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గార్ల మండల అధ్యక్షులు జంపాల శ్రీను,గార్ల మండల ప్రధాన కార్యదర్శి గుగులోత్ దేవా,బుచ్చిబాబు,విశ్వహిందూ పరిషత్ జిల్లా నాయకులు మల్సూర్,ఆజ్మిర రాము,రాజు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News