. లోటుపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం.
ములుగు ఆగస్టు 26 వై 7న్యూస్
మంగళవారం ములుగు జిల్లాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణాభివృద్ధి, స్ర్తీ, శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క సోమవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్,
ఎస్పి షభరిష్ లతో కలిసి గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సును సందర్శించారు. గవర్నర్ బసచేసే అతిథి గృహంతో పాటు పరిసర ప్రాంతాలను వీక్షించే స్థలాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రామప్ప రామప్ప దేవాలయం, హరిత కార్టేజిలు, బండ్ సుందరికరణ
ఏర్పాట్ల పనులను మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
తెలంగాణ గవర్నర్ నూతనంగా నియామకమైన అనంతరం మొదటి పర్యటన ములుగు జిల్లాకు రావడం చాలా సంతోషకరమని మంత్రి తెలిపారు. మొదటిసారిగా జిల్లాకు వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని , మొదటగా జిల్లాకు చేరుకొని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కొద్ది సమయం విశ్రాంతి తీసుకుంటారని అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ములుగు జిల్లా లోని పలు సమస్యలపై అభివృద్ధి పనులపై సమావేశంలో పాల్గొంటారని , సమావేశం ముగిసిన అనంతరం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సందర్శిస్తారని , అనంతరం భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లోని కోటగులను సైతం సందర్శిస్తారని తెలిపారు. అక్కడి నుంచి గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామంలోని లక్నవరం సరస్సును సందర్శించి రాత్రి లక్నవరం సరస్సు ఐలాండ్ లో బస చేస్తారని తెలిపారు.
గవర్నర్ పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని విజయవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాకు మొదటిసారి వస్తున్న గవర్నర్ కు ఘనంగా స్వాగతం పలకాలని, షెడ్యూలు ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్పలోని రామలింగేశ్వర స్వామిని దర్శించుకునే గవర్నర్ కు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి జిల్లా అధికారులకుపలు సూచనలు చేశారు. మొదటిసారి వెనుకబడ్డ ములుగు జిల్లాలో పర్యటించడం ద్వారా జిల్లాకు కావలసిన అభివృద్ధి పనుల్లో వారి సహాయ సహకారాలు ఉండాలని ఆశిస్తున్నామని , టూరిజం జిల్లాను మరింత అభివృద్ధి చెందేలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని ఈ పర్యటనకు జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర్ టి.ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడా కుల అశోక్ మరియు జిల్లా అధికారులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.