మణుగూరు, ఆగస్టు26(వై 7న్యూస్)
జై గౌడ సేన జాతీయ సంఘం తెలంగాణా రాష్ట్ర ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా పినపాక నియోజకవర్గం మణుగూరుకు చెందిన బుర్రా సోమేశ్వర్ గౌడ్ ని నియమించిన జాతీయ అధ్యక్షులు డా. మోర్ల ఏడుకొండలు గౌడ్. ఈ సందర్భంగా బుర్ర సోమేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. గౌడ సంఘం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని గౌడ సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు
Post Views: 108