. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ మణుగూరు
మణుగూరు,ఆగస్టు25(Y7 న్యూస్);
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సీతారామ థియేటర్లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ రెండవ తారీకున ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, ఉదయం 10 గంటలకు మణుగూరులోని ఆంజనేయ స్వామి గుడిలో పూజా కార్యక్రమాలతో పాటు హనుమాన్ టెంపుల్ నుండి సురక్ష బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ మరియు అంబేద్కర్ సెంటర్లో భారీ కేక్ కటింగ్ తో పాటు అనాదాశ్రమాలు వృద్ధాశ్రమాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, అదే రోజు సాయంత్రం గబ్బర్ సింగ్ రీ రిలీజ్ సినిమా ఉంటుందని మీడియా కు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో లింగాల వెంకట్ గౌరవ అధ్యక్షులు, ముజ్జు వర్కింగ్ ప్రెసిడెంట్ ,తుంగల వెంకటేష్ ,నునావత్.సాయి , సల్లూరి. మధు , రేగళ్ల హరీష్ ,భూక్యా రాజేష్ ,గుంజ సాంబ,కొమరం రాజు,మడకం.రాము,గొల్లపల్లి. జెశ్వంత్ , కథరోజు. సతీష్ చారి ,ఆవుల. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు