వై7 న్యూస్, ములుగు జిల్లా ప్రతినిధి:-
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ప్రభుత్వ హాస్టల్లో ఉంటున్న విద్యార్థి కరెంట్ షాక్ కు గురైన ఘటన చోటుచేసుకుంది. గోవిందరావుపేట మండలంలోని కర్లపల్లి బాలుర హాస్టల్లో 9 వ తరగతి చదువుతున్న తాడ్వాయి మండలం బయక్కపేటకు చెందిన నీరటి ముఖేష్ అనే విద్యార్థి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో విద్యార్థిని కాపాడి 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. ములుగు ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు .
Post Views: 679