E-PAPER

“చియా సీడ్స్​తో” బోలెడు లాభాలు..!

ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం మీద చాలా మందికి శ్రద్ధ పెరిగింది. ఈ క్రమంలోనే ఆరోగ్యంగా ఉండ‌టం కోసం అనేక ర‌కాల ఆహారాల‌ను తమ డైట్​లో భాగం చేసుకుంటున్నారు. అందులో చియా సీడ్స్​ ఒకటి. చూసేందుకు అచ్చం స‌బ్జా గింజ‌ల్లాగే ఉంటాయి కానీ.. కాస్త పరిశీలిస్తే తేడా ఉంటుంది. ఇక ఇందులోని పోషకాల పరంగా దీనిని సూపర్​ఫుడ్​గా చెబుతున్నారు. ఈ క్రమంలోనే అసలు చియా సీడ్స్​ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి? ఎలా తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

పోషకాల సూపర్​ఫుడ్​: చియా గింజలు మధ్యఅమెరికాకు చెందిన పుదీనా కుటుంబానికి చెందిన సాల్వియా హిస్పానికా మొక్క నుంచి లభిస్తాయి. ఈ చిన్న గింజలు 5,000 సంవత్సరాలకు పైగా మానవ ఆహారంలో భాగంగా ఉన్నాయట. ఇక ఇందులో వివిధ రకాల పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఈ చియా గింజలు ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తాయని వివరిస్తున్నారు.

బెనిఫిట్స్​ ఇవే:

  • చియా గింజల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుందని.. వీటిని నీటిలో నానబెడితే ఉబ్బి జెల్‌లాగా మారతాయంటున్నారు. ఇక వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుందని.. దీనివల్ల పదే పదే ఆకలి వేయకుండా ఉండి, అతిగా తినే అలవాటు అదుపులోకి వస్తుందంటున్నారు. ఫలితంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అంటున్నారు. ముఖ్యంగా మహిళలకు ఇవి మేలు చేస్తాయని వివరిస్తున్నారు.
  • మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారికి చియా గింజలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలోని ఫైబర్‌ జీర్ణక్రియను వేగవంతం చేసి, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందంటున్నారు. దీంతో మలబద్ధకం సమస్య దూరం అవుతుందని చెబుతున్నారు.
  • చియా గింజలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్​ పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్​, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. ఫలితంగా గుండె జబ్బులు ప్రమాదం తగ్గుతుందని వివరిస్తున్నారు. ​అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు పనితీరు, శరీరంలో వాపును తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయంటున్నారు.

మహిళలకు కూడా ఈ ప్రయోజనాలు:

  • మహిళల్లో వయసు పెరిగే కొద్దీ ఎముకల సాంద్రత తగ్గి ఆస్టియోపోరోసిస్‌ వంటి సమస్యలు వచ్చే ముప్పు ఉందని.. అయితే, చియా గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయని ఇవి ఎముకలు, పళ్లను దృఢంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు.

ఎలా తీసుకోవాలి: ఇన్ని ప్రయోజనాలు కలిగిన చియా సీడ్స్​ను ఎలా పడితే అలా తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. వీటిని అరగంట పాటు నానబెట్టిన తర్వాతే తీసుకోవాలని సూచిస్తున్నారు. అదీ రెండు స్పూన్లకు మించకూడదంటున్నారు. వీటిని రోజూ తాగే ఫ్రూట్‌ జ్యూస్‌లు, ప్రొటీన్‌ షేక్స్, స్మూతీస్‌లో కలిపి తీసుకోవచ్చని వివరిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!