E-PAPER

ఎం.ఎం.కీరవాణిలో ఇంత మార్పా..?

ఆస్కార్‌ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి శారీరకంగా పూర్తిగా మారిపోయాడు. ఏకంగా 22 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా హైదరాబాద్‌లో ఆయనను కలిసిన బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఈ మార్పును చూసి ఫిదా అయ్యాడు. కీరవాణి పట్టుదల, క్రమశిక్షణ నిజంగా స్ఫూర్తిదాయకమంటూ ప్రశంసలు కురిపించాడు. బరువు తగ్గిన తర్వాత ఆయన మరింత ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడని కొనియాడాడు.

హైదరాబాద్‌ పర్యటనలో కీరవాణిని కలిసిన అనుపమ్‌ ఖేర్‌.. ఆ సందర్భానికి సంబంధించిన కొన్ని ఫొటోలను తన ‘ఎక్స్‌’ ఖాతాలో పంచుకున్నాడు. కీరవాణి 22 కిలోల బరువు తగ్గడం అద్భుతమైన విషయమని పేర్కొన్నాడు. ఆయన నడకలోనూ కొత్త ఉత్సాహం కనిపించిందని, ఎంతో సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని తెలిపాడు. సంగీతంలో అద్భుతాలు సృష్టించిన కీరవాణి.. ఇప్పుడు పట్టుదల, ఏకాగ్రతతో ఏదైనా సాధించవచ్చని నిరూపించాడని ప్రశంసించాడు. ఆయన జీవితంలో ప్రారంభమైన ఈ కొత్త ప్రయాణం మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించాడు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!