E-PAPER

కార్యకర్త కుటుంబానికి కష్టకాలంలో అండగా కాంగ్రెస్ పార్టీ

మృతుడి కుటుంబానికి 75 కేజీల బియ్యం అందజేత.. బాధిత కుటుంబానికి భరోసా కల్పించిన కాంగ్రెస్ నాయకులు

కరకగూడెం, నవంబర్ 13 (Y7 న్యూస్ తెలుగు):

కష్టకాలంలో పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తామని కాంగ్రెస్ నాయకులు మరోసారి చాటుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పోలేబోయిన సీతారాంబాబు సోదరుడు పోలేబోయిన ఆదినారాయణ ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన దశదిన కర్మల నిమిత్తం కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ నాయకులు 75 కేజీల బియ్యాన్ని అందజేశారు.

పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఈ సహాయాన్ని అందించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ 25 కేజీలు, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు చౌలం కేశవరావు 25 కేజీలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూనెం శ్యాంకుమారి 25 కేజీల బియ్యాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు.

ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కష్టసమయంలో బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు షేక్ రఫీ, సతీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Y7 న్యూస్ తెలుగు | కరకగూడెం మండల ప్రతినిధి: దిలీప్ కుమార్

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!