E-PAPER

‘నేనొక పనికిమాలిన వాడిని’..! రాజీనామా స‌మ‌యంలో కుంగిపోయిన జెన్సన్ హువాంగ్..!

టెక్నాలజీ ప్రపంచంలో ఒక సంచలనంలా దూసుకెళ్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ ఎన్విడియాలో ఒక శకం ముగిసింది. మూడు దశాబ్దాలకు పైగా కంపెనీకి తిరుగులేని నాయకుడిగా, వ్యవస్థాపకుడిగా ఉన్న జెన్సన్ హువాంగ్ తన సీఈవో పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో వారాల పాటు తన పదవిని కాపాడుకునేందుకు పోరాడిన ఆయన, చివరికి బుధవారం రాత్రి ఓటమిని అంగీకరించి తప్పుకున్నారు.

హువాంగ్ రాజీనామాకు దారితీసిన నాటకీయ పరిణామాలపై ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ‘బ్లూమ్‌బర్గ్’ ఒక సవివరమైన కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం.. ఆరోపణలు వచ్చిన తొలినాళ్లలో గట్టిగా పోరాడిన హువాంగ్, చివరి రోజుల్లో పూర్తిగా పోరాట పటిమను కోల్పోయారు. 

ఒకప్పుడు తిరుగులేని ఆత్మవిశ్వాసంతో, శక్తిమంతంగా కనిపించిన ఆయనలో చివరికి నిస్సహాయత, తీవ్రమైన నిరాశే మిగిలాయని ఆ కథనం పేర్కొంది. ఈ పరిణామాలను దగ్గర నుంచి గమనించిన వ్యక్తులు బ్లూమ్‌బర్గ్‌తో ఈ విషయాలను పంచుకున్నారు.

చుట్టూ ఉన్నవారితో మాట్లాడేటప్పుడు ‘ఏదైతే అది కానివ్వండి’ (whatever), “నేను పట్టించుకోబు” (I don’t care) వంటి మాటలను హువాంగ్ ఎక్కువగా వాడారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతకంటే ముఖ్యంగా తనను తాను తీవ్రంగా విమర్శించుకుంటూ, “నేనొక పనికిమాలిన వాడిని” (a piece of sh**) అని వ్యాఖ్యానించినట్లు కూడా ఆ కథనంలో ఉంది. మానసికంగా ఆయన ఎంతగా కుంగిపోయారో ఈ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి.

ఈ ప్రవర్తన ఆయన సహజ శైలికి పూర్తి విరుద్ధం. ఎన్విడియాలో ఒక చిప్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి ఒక జూనియర్ ఉద్యోగి జీతం వరకు ప్రతి చిన్న విషయాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించేవారని పేరుంది. అలాంటి వ్యక్తి, బోర్డు సమావేశాలు తుదిదశకు చేరుకునేసరికి పోరాట స్ఫూర్తిని వదిలేసి, ఓటమిని అంగీకరించినట్లుగా కనిపించారని సమావేశంలో ఉన్నవారు భావించినట్లు సమాచారం.

ఆయనలోని ఈ మార్పును చూసిన తర్వాతే, బోర్డు ఆయన రాజీనామాను ఆమోదించేందుకు తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గ్రాఫిక్స్ చిప్ సంస్థగా మొదలైన ఎన్విడియాను ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఏఐ కంపెనీగా మార్చిన ఘనత హువాంగ్‌దే కావడం గమనార్హం.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!