E-PAPER

ప్రియుడి మోజులో భర్తను హతమార్చిన భార్య.. ప్రియుడితో కలిసి ఘాతుకం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి ఓ వివాహిత తన భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. భార్య తన ప్రియుడు సంతోష్‌తో కలిసి ఇంట్లోనే భర్తను హత్య చేసినట్లు తెలుస్తోంది. అనంతరం మృతదేహాన్ని చికెన్‌పల్లి సమీపంలో పడేసి ఇద్దరూ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మృతుడి భార్య, ఆమె ప్రియుడు సంతోష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

కుటుంబ బంధాలను కాదని సాగిన ఈ వ్యవహారం చివరకు హత్యకు దారితీయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!