E-PAPER

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్ వెనుక షాకింగ్ స్టోరీ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘బాలు’ సినిమా గుర్తుందా? అప్పట్లో ఈ సినిమాలో పవన్ వేసుకున్న కాస్ట్యూమ్స్, ముఖ్యంగా ఆయన ధరించిన కార్గో ప్యాంట్ యూత్‌ను తెగ ఆకట్టుకుంది. సినిమా విడుదలై దాదాపు రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఆ ప్యాంట్ గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటి, కాస్ట్యూమ్ డిజైనర్ రేణు దేశాయ్ ఈ ప్యాంట్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అప్పట్లోనే ఆ ఒక్క ప్యాంట్ కోసం ఏకంగా రూ.75 వేలు ఖర్చు చేసినట్లు ఆమె చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇటలీలోని మిలన్‌లో ప్రత్యేకంగా ఈ ప్యాంట్‌ను గుర్తించినట్లు రేణు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి ఒరిజినల్ ఆర్మీ క్లాత్‌తో దీన్ని తయారు చేశారట. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్యాంట్లు కేవలం ఐదు మాత్రమే తయారయ్యాయని, వాటిలో ఒకదాన్ని ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్ కొనుగోలు చేయగా, మరొకదాన్ని పవన్ కళ్యాణ్ కోసం తాను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అడ్వాన్స్ చెల్లించి దాదాపు మూడు నెలలు ఎదురుచూసిన తర్వాత ఆ ప్యాంట్‌ను అందుకున్నట్లు చెప్పారు.

అయితే అప్పట్లోనే ఒక ప్యాంట్ కోసం రూ.75 వేలు ఖర్చు చేయడానికి నిర్మాతను ఎలా ఒప్పించారనేది మరో ఆసక్తికరమైన విషయం. సినిమాలో పవన్ ఎక్కువ సన్నివేశాల్లో అదే ప్యాంట్‌తో కనిపించాల్సి ఉండటంతో, ఐదు వేల రూపాయలతో పది సాధారణ ప్యాంట్లు కొనడం కంటే, అదనంగా కొంత మొత్తం ఖర్చు చేసి ఈ అరుదైన ప్యాంట్ తీసుకుంటే తెరపై ప్రత్యేకమైన లుక్ వస్తుందని నిర్మాతకు వివరించినట్లు రేణు దేశాయ్ తెలిపారు.

అలా అప్పట్లో పవన్ కళ్యాణ్ కోసం చేసిన ఈ ప్రత్యేకమైన కాస్ట్యూమ్ ప్రయోగం ఇప్పటికీ అభిమానులకు గుర్తుండిపోయింది. దాదాపు పాతికేళ్ల తర్వాత కూడా ఆ ప్యాంట్ గురించి మాట్లాడుకుంటున్నారంటే పవన్ స్టైల్ ఏ రేంజ్‌లో ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!