E-PAPER

టీచర్స్ కాలనీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం..

ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను కలిసిన కంగాటి శ్రీదేవమ్మ

పత్తికొండ: పట్టణంలోని ఎంపీటీసీ-5 పరిధిలో గల టీచర్స్ కాలనీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ పాల్గొన్నారు.

కాలనీలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతు తెలిపి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఈ నెల 5వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పార్టీ అభ్యర్థుల విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!