పత్తికొండ: పట్టణంలోని ఆదోని రోడ్డులో దర్గా సమీపంలో ప్రసాద్ ఆచారి ఏర్పాటు చేసిన హెచ్పీ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీటీసీ అభ్యర్థి బత్తిన లోకనాథ్, మాదాసి కురువ సంఘం తాలూకా అధ్యక్షుడు, ఎంపీటీసీ కేపీ బ్రహ్మయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అలాగే భాస్కర్, 108 యూనియన్ ఉపాధ్యక్షుడు ఆలి, నలకదొడ్డి గ్రామ అధ్యక్షుడు బత్తిన రాజశేఖర్, బంధువులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొని పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవంలో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ప్రారంభమైన పెట్రోల్ బంక్ నిర్వాహకుడు ప్రసాద్ ఆచారికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.
Post Views: 24








