చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గోమ్ముగూడెం గ్రామంలో ఒక వ్యక్తిపై బ్లేడుతో దాడి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఆకుల శ్యాంసుందర్ రావు (స్థానికంగా ‘మమ్మీ’గా పిలుస్తారు) పై నర్రా విజయ్ కుమార్ అనే వ్యక్తి బ్లేడుతో దాడి చేశాడు.స్థానికుల కథనం ప్రకారం… వీరిద్దరూ తరచూ కలిసి పనులకు వెళ్తుంటారు. రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంటి అరుగుపై వీరిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో, విజయ్ కుమార్ అకస్మాత్తుగా బ్లేడుతో శ్యాంసుందర్ గొంతుపై దాడికి పాల్పడ్డాడు.ఈ దాడి ఏ కారణంతో జరిగింది, ఉద్దేశపూర్వకంగా చేశారా లేక మరేదైనా వివాదం జరిగిందా అనే అంశాలు మాత్రం పోలీసుల పూర్తి స్థాయి దర్యాప్తు, విచారణలోనే వెల్లడికావాల్సి ఉంది.
Post Views: 27








