భద్రాచలం, అక్టోబర్ 21: శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి దసరా నవరాత్రుల సందర్భంగా భద్రాచలంలో బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేసి అమ్మవారి సేవలో భాగస్వాములయ్యారు.
ఈ కార్యక్రమానికి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భోగాల శ్రీనివాస్ రెడ్డి, ఆయన సతీమణి కృష్ణకుమారి అన్నదాతలుగా వ్యవహరించారు. నవరాత్రుల పవిత్ర సమయంలో అన్నదానం నిర్వహించి సేవాభావాన్ని చాటుకున్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అందిస్తున్న సేవలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎం. సూర్యనారాయణ రాజు, కొడాలా శ్రీనివాస్ భాస్కరరావు, చంటి, గిరి, రాంబాబు, వెంకటేశ్వరరావు, పొట్ల వెంకటరమణ, అన్నెం రామిరెడ్డి, రాచమల్ల రాము, బండారు సుధాకర్ రావు, తుమ్మల రాణి, కట్టా కళ్యాణి, భూక్య రంగా, భూక్య సాయి కౌశిక్ పండు తదితరులు పాల్గొన్నారు.
అన్నదానం మహాదానం అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తుల్లో ఆనందాన్ని నింపింది. నవరాత్రుల సందర్భంగా ఆధ్యాత్మికతతో పాటు సేవాభావాన్ని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.








