E-PAPER

పేషంట్ ఏమయ్యాడు..? రికార్డులో ఉంది…. పేషంట్ లేడు

భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన

భద్రాచలం , అక్టోబర్ 21 (వై 7న్యూస్);

ఒక ప్రైవేట్ ఆసుపత్రి పైనుండి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో, ఆసుపత్రి యాజమాన్యం పిర్యాదు మేరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని గాయాలతో బాధపడుతున్న వ్యక్తిని చికిత్స కొరకు ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. కాగా పోలీసులే స్వయంగా అడ్మిట్ చేయగా…. ఆ పేషెంట్ ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో లేకపోవడం సంచలనంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రి రికార్డులో ఆ వ్యక్తి అడ్మిట్ అయినట్లు ఉన్నా… వైద్యులు మాత్రం తమకేమి తెలియదని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తుంది.ఒకవేళ ఆ పేషెంట్ కు తగిలిన గాయాలు చిన్నవే అయితే, డిశ్చార్జ్ రిజిస్టర్ లో కూడా ఎంట్రీ చేయాలి. కానీ అసలు అటువంటి పేషంట్ ఎవరు ప్రభుత్వ ఆసుపత్రికి రాలేదు అని చెప్పడం వెనుక ఇద్దరు వైద్యులను కాపాడటం కొరకే అని తెలుస్తుంది. ప్రయివేట్ ఆసుపత్రిలో సంఘటన జరగడంతో ఆ వైద్యుని కాపాడటం కొరకు ఒక కారణం కాగా, ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిషన్ రాపించి, కొందరు ప్రభుత్వ వైద్యులు పేషెంట్లను తమ ప్రయివేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.మంగళవారం రాత్రి కూడా అదే జరిగిందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించే ఎముకల వైద్యుడిని కూడా కాపాడటం కోసం పేషెంట్ వివరాలను ప్రభుత్వ వైద్యులు దాచి పెడుతున్నారని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఒక వ్యక్తి ఆత్మహత్యా యత్నం కు పాల్పడితే… వెంటనే ఎఫ్ ఐ ఆర్ చేయాల్సిన పోలీసులు ఎఫ్ ఐ ఆర్ చేయకపోవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయానే చర్చ జరుగుతుంది.

మేమే ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసాం…. సి ఐ రాజు
…………………… …..

మంగళవారం రాత్రి బస్టాండ్ వెనుక గల ఒక ప్రయివేట్ ఆసుపత్రి పైనుండి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ వ్యక్తి వివరాలు గురించి భద్రాచలం సి ఐ రాజు ను వై7 న్యూస్ వివరణ కోరగా…. ప్రయివేట్ ఆసుపత్రిలో పేషెంట్ కు సహాయకునిగా వచ్చిన వచ్చిన వ్యక్తి గత రెండురోజులుగా అదే ఆసుపత్రిలో ఉంటున్నాదని, అదే ఆసుపత్రి పైనుండి ఆ వ్యక్తి దూకడంతో గాయాలు కాగా, అతన్ని పోలీసులు సహకారంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించామని తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అతను ఆసుపత్రి పైనుండి దూకినట్లు తెలిసిందని పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!