దుమ్ముగూడెం: మండలంలోని దుమ్ముగూడెం గ్రామపంచాయతీ పరిధిలో రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రేషన్ దుకాణం వద్ద బుధవారం గ్రామపంచాయతీ వార్డు సభ్యులు కెల్లా సంధ్యారాణి, పూజారి రాజేష్ సమక్షంలో కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ.. ప్రస్తుతం రేషన్ పొందుతున్న లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు స్మార్ట్ కార్డులు పొందని వారు సంబంధిత రేషన్ దుకాణంలో వాటిని తీసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వ సేవలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియలో స్మార్ట్ రేషన్ కార్డులు భవిష్యత్తులో మరింత ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కెల్లా శేఖర్, గడ్డం బాలాజీ, లంకా రాంప్రసాద్, జిల్లా నాయకులు పిలకా వెంకటరమణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రేషన్ లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.








