భద్రాచలం టౌన్, అక్టోబర్ 8, Y7 NEWS TELUGU:

భద్రాచలం బ్రిడ్జి నుండి దుమ్ముగూడెం మండలం గోవిందపురం గ్రామానికి చెందిన జంపన్న అనే యువకుడు మద్యం మత్తులో బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకాడు. నదిలో కొంత ధూరం కొట్టుకుపోయిన యువకుడు ఇసుక తెన్నుల్లో చిక్కుకున్నట్లు సమాచారం ..అనంతరం మత్తు వీడిన జంపన్న ప్రాణ భయంతో కాపాడండి అంటూ భిగ్గరగా అరుస్థుండటం గమనించిన వాహనధారులు పోలిసులకి సమాచారం ఇవ్వటంతో సంఘటన స్థలానికి చేరుకున్న భద్రాచలం సి ఐ రాజు మరియు సిబ్బంధి గజ ఈతగాడు ప్రసాద్ సహాయంతో యువకుడుని సురక్షితంగా వొడ్డుకు చేర్చి ప్రథమ చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా,చికిత్స ఆంధించిన వైద్యులు సురక్షితంగా ఉన్నట్లు వెళ్లండిచారు..అనంతరం యువకుడుని పోలీస్ స్టేషన్ కు తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు రాగానే కౌన్సిలింగ్ ఇచ్చి పంపనున్నట్లు సిఐ సట్ల రాజు వెల్లడించారు..








