E-PAPER

వరంగల్‌లో ‘గ్రీన్ భద్రాద్రి’ స్ఫూర్తితో పర్యావరణ సంస్థ ఏర్పాటు

భద్రాచలం, అక్టోబర్ 6: గ్రీన్ భద్రాద్రి చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు స్ఫూర్తి పొంది వరంగల్‌లోనూ పచ్చదనం పెంపొందించేందుకు ప్రత్యేక పర్యావరణ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు కడారి ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.

గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం భద్రాచలంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. గ్రీన్ భద్రాద్రి ఫౌండర్, హనుమకొండ అడిషనల్ కలెక్టర్ Y.V. గణేష్ IAS సూచన మేరకు కడారి శ్రీనివాస్, ఆయన మిత్రబృందం భద్రాచలానికి చేరుకుని గ్రీన్ భద్రాద్రి బృందంతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వరంగల్‌లో గ్రీన్ భద్రాద్రి తరహాలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే సంస్థను ఏర్పాటు చేసి, విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ, ప్రజల్లో పర్యావరణంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని కడారి ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.

అనంతరం గ్రీన్ భద్రాద్రి, కడారి ఫౌండేషన్ ప్రతినిధులు కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై తమ నిబద్ధతను చాటుకున్నారు. ప్రకృతిని కాపాడేందుకు ప్రతి ప్రాంతంలో విస్తృతంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, కోశాధికారి ఉప్పాడ రామ్ ప్రసాద్ రెడ్డి, డాక్టర్ లయన్ భూపతిరావు, పళ్ళింటి దేశప్ప, కామిశెట్టి కృష్ణార్జున రావు తదితరులు పాల్గొన్నారు. కడారి సేవా ఫౌండేషన్ తరఫున కడారి శ్రీనివాసు, గట్ల రాజన్న, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గ్రీన్ భద్రాద్రి చేపడుతున్న పర్యావరణ కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి సంస్థలు ఏర్పడి పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేయడం అభినందనీయమని పాల్గొన్న వారు పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!