పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు, భక్తులు
చుంచుపల్లి, అక్టోబర్ 3 (y7 న్యూస్):
బాబూక్యాంప్‌లోని భగత్‌సింగ్ విగ్రహం వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీపీఐ సీనియర్ నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గారాశి వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దుర్గారాశి లక్ష్మి, ఉపసర్పంచ్ పోలమూరి శ్రీనివాస్, సర్పంచ్ నునావత్ కుమారి, బాబూక్యాంప్ వార్డు సభ్యులు సాధా, జోగ అమూల్, తావటం మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ బాబూక్యాంప్ కార్యదర్శి అల్లకొండ కోటి, ఎన్‌కే నగర్ వార్డు సభ్యులు బొంకూరి క్రాంతికుమార్, బాబూక్యాంప్ యూత్ అధ్యక్షుడు దింపూ, ఎం.డి. ఇమ్రాన్, ఎస్.కె. పాషా తదితరులు కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.కార్యక్రమ కమిటీ సభ్యులు పోలమూరి శ్రీనివాస్, కోటి, అమూల్, క్రాంతికుమార్, ఎం.డి. ఇమ్రాన్, ప్రసాద్, రాము, బంటీ, బుడ్డీ, లడ్డూ, పవన్, తాడా, కన్ను, సాగర్, శ్యామ్, మురళి సాయి, మట్ల రాజేష్ తదితరుల సమక్షంలో అన్నదాన కార్యక్రమం కొనసాగింది.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మహా అన్నదాన కార్యక్రమానికి హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించిన ప్రజలు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని, భగవంతుడి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.








