చీరాల, అక్టోబర్ 02(వై 7న్యూస్ ); తోటవారిపాలెం గ్రామంలో రెండు రోజుల క్రితం జరిగిన విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన చీరాల జాలమ్మ గుడి ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకుల కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ శుక్రవారం పరామర్శించారు.
చీరాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి వెళ్లిన ఆమంచి కృష్ణమోహన్ మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం ప్రక్రియను వేగవంతం చేసి, మృతదేహాలను త్వరగా కుటుంబ సభ్యులకు అప్పగించాలని వైద్యులు, పోలీసు అధికారులను కోరారు.
అనంతరం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ విషాద సమయంలో కుటుంబాలకు అండగా ఉంటానని, “ఏ కష్టం వచ్చినా మీకు నేను ఎల్లవేళలా అండగా ఉంటాను” అంటూ భరోసా కల్పించారు.
Post Views: 23








