కొత్తగూడెం, అక్టోబర్ 2 (Y7 న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, గాంధీజీ అహింస, సత్యం, శాంతి మార్గాలను ఆయుధాలుగా చేసుకుని దేశ స్వాతంత్ర్య సాధన కోసం మహత్తర పోరాటం చేశారని పేర్కొన్నారు. సోదరభావం, ఐక్యతతో ముందుకు సాగితే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని అన్నారు.
యువత కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. అలాగే జిల్లా కేంద్ర గ్రంథాలయానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రేడ్-2 గ్రంథపాలకురాలు ఎస్. లలిత కుమారి, జి. మణిమృదుల, గ్రంథాలయ సిబ్బంది వినోద్, ఈశ్వరి, విద్యార్థినీ విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు తదితరులు పాల్గొన్నారు.
Y7 NEWS – ప్రజల గొంతుక









