కుక్కను తప్పించబోయి అదుపుతప్పిన ద్విచక్ర వాహనం
చికిత్స పొందుతూ మృత్యువాత.. కుటుంబంలో విషాదం
చుంచుపల్లి, అక్టోబర్ 2(Y7 న్యూస్)
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందిన విషాద ఘటన కొత్తగూడెం విద్యానగర్ కాలనీ హనుమాన్ ఆలయం సమీపంలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. వేపలగడ్డకు చెందిన రొంకు సత్యనారాయణ (27) హైదరాబాద్‌లోని విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వర్క్‌ఫ్రం హోమ్ కారణంగా స్వగ్రామంలో ఉంటున్న ఆయన గురువారం రాత్రి పనిమీద కొత్తగూడెం వచ్చాడు. అనంతరం ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళ్తుండగా విద్యానగర్ హనుమాన్ ఆలయం సమీపంలో రోడ్డుపై అకస్మాత్తుగా కుక్క ఎదురైంది.
దానిని తప్పించేందుకు ప్రయత్నించడంతో ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో సత్యనారాయణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు.
కుమారుడి మృతితో కుటుం
బ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు.









