కారకగూడెం అక్టోబర్ 2 (Y7 తెలుగు న్యూస్): జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని సీతారాంపురం గ్రామంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.
గాంధీ స్మారక నిధి కరకగూడెం మేనేజర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు నాగబండి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, కరకగూడెం సర్పంచ్ పోలేబోయిన సుజాత, గ్రామ పెద్దలు కొంపెల్లి పెద్ద రామలింగం, గొగ్గలి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
అతిథులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ దేశానికి చేసిన సేవలను, సత్యం–అహింసా సిద్ధాంతాలను స్మరించుకున్నారు. గాంధీ చూపిన సత్యం, అహింస మార్గాలు నేటికీ ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు చందా రత్నమ్మ, వార్డు సభ్యుడు గొగ్గలి వేణు, గొగ్గలి కేశవరావు, సాంబయ్య, సోనీ, యువకులు, గ్రామస్తులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
– దిలీప్ కుమార్, కరకగూడెం మండలం ప్రతినిధి, Y7 న్యూస్ తెలుగు









