E-PAPER

బిజెపి సీనియర్ నాయకులు నోముల రామారావుకు చిరు సన్మానం

45 ఏళ్లు రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా
జూనియర్ అద్వానీగా అభివర్ణించారు

కూనవరం, (వై7 న్యూస్), సెప్టెంబర్ 18: భారతీయ జనతా పార్టీ కూనవరం మండల అధ్యక్షులు మండల కమిటీ సభ్యులు చేతుల మీదుగా సీనియర్ నాయకులు నోముల రామారావు శాలువాతో సత్కరించి పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు.
గత 45 సంవత్సరాలుగా బిజెపి పార్టీ అభివృద్ధికి అనునిత్యం కృషి చేస్తూ పార్టీ కోసం పరితపిస్తూ పార్టీలో ఒక మండల అధ్యక్షులు స్థాయి నుండి వివిధ జిల్లా, రాష్ట్ర బాధ్యతలు దిగ్విజయంగా పూర్తిచేసుకుని సలహాదారునిగా ఒక కార్యకర్తగా ఒక సీనియర్ నాయకునిగా పార్టీ కార్యక్రమాలను చేస్తూ బిజెపి పార్టీకి వారి సేవలను గుర్తించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించినటువంటి నోముల రామారావు గారికి మండల పార్టీ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ
కార్యకర్తలకు సమస్యలను పరిష్కారం లో ముందుండి నడిపించి పార్టీ కార్యక్రమాలకు అండగా ఉంటూ జూనియర్ అద్వానీ గా బిజెపి రామారావు తన ఇంటి పేరు కు బదులుగా బిజెపినే తన ఇంటి పేరుగా ప్రజల మనసులో నిలిచి బిజెపి రామారావు కూనవరం మండల ఉత్తమ కార్యకర్త సలహాదారు సేవా సంకల్పం కలిగిన వ్యక్తిగా ఒక సీనియర్ నాయకుడిగా ఉంటూ పార్టీ కార్యకర్తలకు సమస్యల పరిష్కారం లో ముందుండి అనారోగ్య సమస్యలను కూడా లెక్కచేయకుండా పార్టీని నడిపిస్తూ అందరి ఆదరణ పొందిన వ్యక్తిగా నీలిచిన బిజెపి రామారావు నోముల రామారావు కి మండల కమిటీ సభ్యులు సాలువాతో సత్కరించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కరక పవన్ కుమార్, మహిళా మోర్చా అధ్యక్షురాలు సోయం సుధారాణి , యువ మోర్చా అధ్యక్షులు పూణెం సురేష్ దళిత మోర్చా అధ్యక్షులు కొవ్వాల రాజా, జిల్లా కార్యదర్శి నోముల సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శులు చూడబోయిన వెంకటేశ్వర్లు పాయం వెంకన్న బాబు మండల ఉపాధ్యక్షులు బివిఎస్ నారాయణ, పూసం ప్రసాద్, సోడే వెంకటేశ్వర్లు , పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!