శ్రీకాకుళం జిల్లా, పలాస: పలాస మండలం గరుడకండి గ్రామ సమీపంలోని సవర గెడ్డలో గుర్రపుడెక్కల మధ్య గుర్తుతెలియని వ్యక్తి చిక్కుకుపోయిన ఘటన చోటుచేసుకుంది.
గెడ్డలో చిక్కుకున్న వ్యక్తిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు.
ఎస్ఐ దుర్గ ప్రసాద్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది సహాయంతో సహాయక చర్యలు చేపట్టి, గుర్రపుడెక్కల మధ్య చిక్కుకున్న వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
అనంతరం అతడిని 108 అంబులెన్స్‌లో పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టిన పోలీసు, అగ్నిమాపక సిబ్బందిని స్థానికులు అభినందించారు.
Post Views: 39








