E-PAPER

నమస్తే తెలంగాణ సర్క్యులేషన్ ఇన్‌చార్జి తల్లి మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన రావులపల్లి రాంప్రసాద్

దుమ్ముగూడెం ! నమస్తే తెలంగాణ పత్రిక సర్క్యులేషన్ ఇన్‌చార్జి శ్రీనివాస్ తల్లి కొడెం విజయ ప్రమాదవశాత్తు లారీ కింద పడి మృతి చెందిన విషాద ఘటన తెలిసిందే. ఈ సందర్భంగా భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జి రావులపల్లి రాంప్రసాద్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కొడెం విజయ మృతికి సంతాపం తెలియజేస్తూ, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఆకోజు సునీల్, రేపాక పూర్ణచంద్రరావు, బాబి తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!