శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది.
చల్లటి గాలులతో కూడిన వర్షం కురవడంతో రహదారులపై ప్రయాణిస్తున్న వాహనదారులు, పాదచారులు ఎక్కడికక్కడ ఆగి దుకాణాలు, షెడ్ల వద్ద తలదాచుకున్నారు. కొంతసేపు వర్షం కారణంగా సాధారణ జనజీవనం కూడా ప్రభావితమైంది.
ఇదిలా ఉండగా, వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, శిథిలావస్థలో ఉన్న భవనాల కింద నిలవవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
– రిపోర్టర్ దినేష్
Post Views: 23








