E-PAPER

మంచు కొండలను తలపిస్తున్న రెల్లుగడ్డి

అశ్వాపురం, సెప్టెంబర్ 8:
సీతారామ ప్రాజెక్టు పనుల కోసం ఏర్పాటు చేసిన మట్టి గుట్టలపై విరివిగా పెరిగిన తెల్లటి రెల్లుగడ్డి ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. వర్షాకాలంలో దట్టంగా పెరిగిన రెల్లుగడ్డి తెల్లటి పుష్పాలతో కప్పుకుపోవడంతో దూరం నుంచి మంచుతో కప్పబడిన కొండలను తలపిస్తోంది.

గాలి వీచిన ప్రతిసారీ తెల్లటి పుష్పగుచ్ఛాలు అలల మాదిరిగా ఊగుతూ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ప్రాజెక్టు పనుల కోసం ఏర్పడిన మట్టి గుట్టలకు ప్రకృతి సహజంగానే సరికొత్త అందాన్ని అద్దింది.

అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు ఈ ప్రకృతి దృశ్యాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. సాధారణంగా మట్టి గుట్టలుగా కనిపించే ప్రాంతం ప్రస్తుతం తెల్లటి రెల్లుపూలతో ప్రత్యేక ఆకర్షణగా మారింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!