బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ భేటీలో ఇరువురు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నితిన్ నబిన్ రాష్ట్రపతిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా దేశానికి సంబంధించిన పలు కీలక అంశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. మర్యాదపూర్వక భేటీలో భాగంగానే ఈ సమావేశం జరిగినట్లు సమాచారం.
భేటీకి సంబంధించిన ఫొటోలను నితిన్ నబిన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కావడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబిన్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.








