
పారదర్శకంగా వార్తలు ప్రచురించి సమాజ హితం కోసం పనిచేయాలని సూచన
అశ్వాపురం, సెప్టెంబర్ 2:
అశ్వాపురం మండలంలో నూతనంగా ఏర్పాటైన నవచైతన్య ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు బుధవారం మండల కేంద్రంలోని తుళ్లూరి బ్రహ్మయ్య క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్‌కు ఎన్నికైన అధ్యక్షుడు, కార్యదర్శి సహా కమిటీ సభ్యులను తుళ్లూరి బ్రహ్మయ్య అభినందించి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, నూతన ప్రెస్ క్లబ్‌లోని విలేకరులందరూ సమాజ హితం కోసం నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరిస్తూ వార్తలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమైందని, ప్రజలు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే మీడియా వ్యవస్థ ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభమని పేర్కొన్నారు.
ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నవచైతన్య ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు కుందూరు శ్రీనివాస్ రెడ్డి, గౌరవ సలహాదారు తునికేసి సురేందర్ రెడ్డి, కోశాధికారి ఎస్.కే. ఖదీర్, ఉపాధ్యక్షులు కత్తెరం వెంకటరమణారెడ్డి, పగడాల వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శి గరికపాటి అంజన్‌రావు, సభ్యులు మండల విజయ్ కుమార్, కానూరి రాంబాబు, అలవాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.








