E-PAPER

POCO X8 5G: 8,340mAh బ్యాటరీతో అదరగొట్టే కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు ఇవే!

టెక్ ప్రియులను ఆకట్టుకునేలా పోకో కొత్తగా POCO X8 5G స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. భారీ 8,340mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, పెద్ద 1.5K OLED డిస్‌ప్లే, బలమైన బిల్డ్‌తో ఈ ఫోన్‌ను రూపొందించింది. ముఖ్యంగా భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. అధునాతన కెమెరా ఫీచర్లను కూడా ఇందులో అందించారు.

POCO X8 5Gలో 6.83 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. 3,200 నిట్స్ వరకు గరిష్ఠ బ్రైట్‌నెస్, 12-bit కలర్ డెప్త్, HDR10+ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే 240Hz టచ్ శాంప్లింగ్, 3,200Hz వరకు ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్, 3,840Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్, DC డిమ్మింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.

కళ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు TÜV Rheinland ఐ కేర్ సర్టిఫికేషన్లను కూడా ఈ డిస్‌ప్లేకు అందించారు. స్క్రీన్‌ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2ను ఉపయోగించారు. దాదాపు మూడు మీటర్ల ఎత్తు నుంచి ఫోన్‌ పడిపోయిన సందర్భాల్లోనూ మెరుగైన రక్షణ అందించేలా దీనిని రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. భారీ బ్యాటరీ, ప్రీమియం డిస్‌ప్లే, బలమైన నిర్మాణంతో POCO X8 5G మార్కెట్‌లో ప్రత్యేకంగా నిలిచే అవకాశముంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!