టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ మెగా ఈవెంట్ ‘సర్ప్రైజ్ అండ్ షైన్’ సెప్టెంబర్ 9న జరగనున్నట్లు సమాచారం. ఈ గ్రాండ్ ఈవెంట్లో నెక్స్ట్ జనరేషన్ iPhone 18 Pro, iPhone 18 Pro Max స్మార్ట్ఫోన్లను యాపిల్ ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. కొత్త ఐఫోన్ సిరీస్‌లో పలు కీలక అప్‌గ్రేడ్స్ ఉంటాయని ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే అధికారిక లాంచ్‌కు ముందే iPhone 18 Pro సిరీస్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన లీక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఫోన్ లైనప్, కలర్ ఆప్షన్స్‌కు సంబంధించిన వివరాలు టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గత మోడళ్లతో పోలిస్తే కొత్త సిరీస్‌లో యాపిల్ కొన్ని కీలక మార్పులు చేయనున్నట్లు లీక్‌లు సూచిస్తున్నాయి.
iPhone 18 Pro, iPhone 18 Pro Max మోడళ్లపై ఇప్పటికే వినియోగదారుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా కొత్త కలర్ వేరియంట్లపై టెక్ ప్రియుల్లో క్యూరియాసిటీ పెరిగింది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వివరాలు అధికారికంగా ధృవీకరించబడలేదు. యాపిల్ అధికారికంగా ప్రకటించే వరకు వీటిని లీక్లుగానే పరిగణించాల్సి ఉంటుంది.








