E-PAPER

అనారోగ్య బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సహాయం

బూర్గంపాడు, ఆగస్టు 28 (Y7 న్యూస్):
బూర్గంపాడు మండలం వేపలగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలోని వేపలగడ్డ గ్రామానికి చెందిన కణితి రామకృష్ణ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆర్థిక సహాయం అవసరమైన నేపథ్యంలో దాతలను ఆశ్రయించారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న బట్టా మల్లయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ బట్టా విజయ్ గాంధీ మరియు వేపలగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ బొల్లి నిరోష స్పందించి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ట్రస్టు ప్రతినిధులకు, సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అవసరంలో ఉన్న ప్రజలకు సహాయం చేయడం సామాజిక బాధ్యతగా భావించి ట్రస్టు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోందని ట్రస్టు ప్రతినిధులు పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!