బూర్గంపాడు, ఆగస్టు 28 (Y7 న్యూస్):
బూర్గంపాడు మండలం వేపలగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలోని వేపలగడ్డ గ్రామానికి చెందిన కణితి రామకృష్ణ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆర్థిక సహాయం అవసరమైన నేపథ్యంలో దాతలను ఆశ్రయించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న బట్టా మల్లయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ బట్టా విజయ్ గాంధీ మరియు వేపలగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ బొల్లి నిరోష స్పందించి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ట్రస్టు ప్రతినిధులకు, సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అవసరంలో ఉన్న ప్రజలకు సహాయం చేయడం సామాజిక బాధ్యతగా భావించి ట్రస్టు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోందని ట్రస్టు ప్రతినిధులు పేర్కొన్నారు.
Post Views: 9








