చైనాలో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. దక్షిణ చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లాంగ్చాంగ్ సిటీలో రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. భూమికి 13 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చైనా ఎర్త్‌క్వేక్ నెట్వర్క్స్ సెంటర్ వెల్లడించింది.
మరోవైపు నేపాల్‌లో గురువారం రాత్రి 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. సిక్కింలోని యుక్సామ్కు పశ్చిమ-వాయువ్యంగా 24 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
నేపాల్ సరిహద్దులకు, రాజధాని ఖాట్మండుకు దూరంగా భూకంప కేంద్రం ఉండటంతో పర్వత ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు స్వల్ప ప్రకంపనలు కనిపించాయి. ఇప్పటివరకు ఈ రెండు భూకంపాల కారణంగా భారీ నష్టం లేదా ప్రాణనష్టానికి సంబంధించిన సమాచారం వెలువడలేదు.
Post Views: 2








