జామా మజీద్ కమిటీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ
మణుగూరు, ఆగస్టు 28 (Y7 న్యూస్ తెలుగు):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలోని శేషగిరినగర్ జామా మజీద్ సదర్ కమిటీ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబి వేడుకలను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
మహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం జుమా నమాజ్ అనంతరం మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులు, మత పెద్దలు, చిన్నారులు మసీదు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు జెండాలు చేతపట్టి శాంతి ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధించిన ప్రేమ, శాంతి, సోదరభావం, కరుణ, మానవత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని సూచించారు. యువత మద్యం, డ్రగ్స్ వంటి నిషేధిత పదార్థాలకు దూరంగా ఉండి సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జామా మజీద్ సదర్ కమిటీ సభ్యులు ఎం.డి. మొహినుద్దీన్, ఇస్మాయిల్, ఖాసీం, జావిద్‌తో పాటు ముస్లిం మత పెద్దలు ముస్తఫా, సిరాజ్, నూరుద్దీన్, కమారే ఆలం తదితరులు పాల్గొన్నారు.








