E-PAPER

YouTubeకు పోటీగా Bilibili.. క్రియేటర్లకు భారీ చెల్లింపుల ప్రచారం!

చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ Bilibili పాశ్చాత్య దేశాల మార్కెట్లపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ కంటెంట్‌ క్రియేటర్లను ఆకర్షించేందుకు ప్రతి 1,000 వ్యూస్‌కు సుమారు 0.70 డాలర్లు అంటే దాదాపు రూ.60 చెల్లించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చెల్లింపులపై Bilibili అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

YouTubeతో పోలిస్తే క్రియేటర్లకు మెరుగైన ఆదాయం అందించడమే లక్ష్యంగా Bilibili ముందుకు సాగుతోందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ ప్లాట్‌ఫామ్‌కు 37 కోట్లకుపైగా నెలవారీ వినియోగదారులు ఉన్నట్లు ప్రచారం ఉంది. అంతర్జాతీయ క్రియేటర్ల కోసం మానిటైజేషన్‌ అవకాశాలను విస్తరించడంతో పాటు, రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

విదేశీ వినియోగదారులను ఆకర్షించేందుకు స్థానిక కంటెంట్‌, ప్రత్యేక ఫీచర్లను అందించేందుకు కూడా సంస్థ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే వ్యూస్‌కు చెల్లించే మొత్తం, అంతర్జాతీయ మానిటైజేషన్‌ విధానంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. నిజంగానే ఈ స్థాయి చెల్లింపులు అందిస్తే YouTubeకు Bilibili నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!